జమ్మలమడుగు ముద్దనూరు రహదారిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకీ తెస్తామని జమ్మలమడుగు శాసనసభ్యులు డా. మూలె సుధీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న తాతిరెడ్డి నరసింహారెడ్డి జలాశయం లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రయాణికులు విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు మాట్లాడుతూ బ్రిడ్జి లేకపోవడంతో పాఠశాలకు సమయానికి వెళ్లడం ఆలస్యము అవడంతో పాటు, రవాణా ఖర్చులు కూడా భారంగా ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ నీటి ప్రవాహం తగ్గగానే అప్రోచ్ రోడ్ తో పాటు, బ్రిడ్జిని కూడా వీలయినంత తొందరగా నిర్మాణపనులు పూర్తికీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.