కరివేపాకులో అనేక ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు వల్ల విటమిన్ ఏ, సీ శరీరానికి అందుతుంది. కరివేపాకుతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. బరువు పెరిగేవారు దీనిని వాడితే సన్నబడవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.