అమెరికాలోని మిస్సోరి వాల్మార్ట్ స్టోర్లో మంగళవారం ప్రవేశద్వారం వద్ద తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పలువురు కస్టమర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కింద పడేసి, కాళ్లతో తన్నుకున్నారు. చేతికి అందిన వస్తువులతో ఇతరులను గాయపర్చారు. 25 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నట్లు స్టోర్ అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతోంది.