మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతికూరలో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ మరియు విటమిన్లు ఎ, బి6, సి మరియు కె ఉన్నాయి, ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి మెంతులు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతి గింజలను వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి మూతపెట్టి వడగట్టి తాగాలి.