జింక్ అనేది బాల్యంలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే పోషకాహారం.మానవ శరీరానికి తగినంత జింక్ సరఫరా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో ప్రొటీన్లు, డీఎన్‌ఏలను తయారు చేసేందుకు తోడ్పడుతుంది. గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. బీన్స్, మాంసం మరియు చేపలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి శరీరానికి జింక్ అవసరం.జింక్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది అధిక రక్తపోటు, మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. కంటి రెటీనాలో సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది.అంతే కాకుండా నరాల బలహీనత, ఎముకలను బలహీనపరిచే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు దూరమవుతాయి.