ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3, 67, 703 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. డ్యామ్ 10 క్రస్టుగేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3, 77, 160 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడిచి పెడుతున్నారు. ఆదివారం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుత నీటి మట్టం 884. 50 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 807 టీఎంసీలు కాగా ప్రస్తుత ప్రాజెక్టు నీటి నిల్వ 212. 9198 టీఎంసీలుగా నమోదైంది.