అక్టోబర్ 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 20వ తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటికి సిత్రాంగ్ తుఫాన్ తోడు కానుంది. దీంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వాలు ఇప్పటికే జాగ్రత్త చర్యలు చేపట్టారు.