భారత్ లో తొలిసారిగా వైద్య విద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టారు. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రారంభించడం చారిత్మాత్మక నిర్ణయం అని అమిత్ షా అన్నారు. అనంతరం హిందీ ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను ఆవిష్కరించారు.