తమిళనాడులోని అరియలూర్ జిల్లా తాపలూర్ కు చెందిన శక్తివేల్, సత్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. మేల్ కుడికాడుకు చెందిన అమృతరాజ్ తో సత్యకు వివాహేతర సంబంధం ఏర్పడి అతనితో వెళ్లింది. పోలీసులు తిరిగి సత్యను భర్త వద్దకు చేర్చారు. ఆ తర్వాత అమృతరాజ్ తమ్ముడు దేవాతో సత్య వెళ్లిపోయింది. విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు. ఆ తర్వాత అమృతరాజ్ కు సత్యకు ఆర్దిక వివాదాలు తలెత్తగా అమృతరాజ్ తన తండ్రితో కలిసి సత్యను హత్య చేశాడు.