ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజు రాజకీయ వారసుడిగా ఆయన తమ్ముడు కుమారుడు, కథానాయకుడు ప్రభాస్ సోదరుడైన ప్రభోద్ ను రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయించేందుకు రంగం సిద్ధమవుతోంది. నరసాపురం, కాకినాడ, రాజమండ్రిలో ఒక స్థానం నుంచి ఆయన పోటీకి దిగడం ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే కృష్ణంరాజు కొవిడ్ అనంతర వ్యాధులతో భాద పడుతూ కన్నుమూశారు. ఆయన రాజకీయ వారసుడిగా ప్రభోద్ ను దింపాలని వారి కుటుంబానికి సన్నిహితుడైన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ భావిస్తున్నారు. ఆయన కోరిక మేరకే ప్రభోద్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.