ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు: కె.నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 16, 2022, 10:23 PM

మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వెల్లడించారు. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి అంటూ అభివర్ణించారు. మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్ అని వ్యాఖ్యానించారు. విశాఖలో భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  ఏపీ రాజధాని అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటిస్తే, నాడు జగన్ ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు. 


సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని, అందుకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com