కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదవికి పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఎన్నిక కోసం అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి చాలా సంవత్సరాల తర్వాత గాంధీయేతర వ్యక్తి ఎన్నిక కానుండడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa