అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ, ప్రతీ విషయంలో వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ఆళ్లగడ్డకు వచ్చిన సీఎం వైయస్ జగన్‌కు మ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా పథకం అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వరుఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా రైతన్నకు అండగాసగా నాలుగో ఏడాది రెండో విడత రైతు భరోసా పథకం అమలు బహిరంగ సభలో ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘రెతు భరోసా పథకం అన్నదాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. పంట పెట్టుబడి సమయాల్లో రైతులు ఇబ్బంది పడకూడదు, ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండొద్దు.. అప్పులపాలు కాకూడదనే గొప్ప ఆలోచనతో వైయస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటనష్టం జరిగితే అదే సీజన్‌లో రైతుల అకౌంట్లలోనే పరిహారం అందజేయడం జరుగుతుంది. గతంలో సీఎం వైయస్ జగన్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించి, ఆ పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి చెల్లించాల్సిన డబ్బు కూడా 45 రోజుల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటే సీఎం వైయస్ జగన్ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది అని అయన తెలియజేయారు.