రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాన్ని తుఫాన్ పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 18-20 తేదీల మధ్య అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడనున్న అల్పపీడనం అనంతరం వాయుగుండంగా, తుఫాన్‌గా బలపడి ఈ నెల 22 తర్వాత కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అండమాన్ సముద్రంలో ఈనెల 17న అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 25కల్లా ఏపీ/ఒడిసా తీరం దిశగా వస్తుందని వాతావరణ విభాగం అంచనా వేసినట్టు పేర్కొంది.