చిత్తూరు, మదనపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన నరసమ్మ (34) కడుపునొప్పి భరించలేక ఆదివారం ఇంట్లోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.