అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలో ఉపాధి హామీ పథకంలో రూ. 6 కోట్ల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టామని జిల్లా ఉపాధి పథకం అభివృద్ధి అధికారి యోగాంజనేయరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులను తనిఖీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఆర్పి కన్నారెడ్డి, ఏపీఓ వెంకటేష్, డీఆర్పీలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.