బీజేపీ నాయకులూ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కిషన్‌రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఏలూరు, గుంటూరు జిల్లాల్లో కేంద్రమంత్రి పర్యటించనున్నారు. వైజాగ్‌లో జనసేన నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసిన దానిపై కిషన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలు అనేది కరెక్ట్ కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ తమ కార్యక్రమాలు చేసుకోవాలని... అంతే కానీ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని అన్నారు. భారతీయ జనతా పార్టీ గా మొదటి నుండి అదే చెబుతున్నామని తెలిపారు.