విశాఖలో జరిగిన పరిణామాలపై పవన్ కళ్యాణ్ నోవెటల్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. సోమవారం తెల్లవారుజామున పవన్ కళ్యాణ్ విశాఖ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జనసేన నేతల అరెస్టు, జనసేన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్న వైనం, జనవాణి వాయిదా తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో కలిసి సమీక్షించారు. పార్టీని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ నేతలకు పూర్తిగా అండదండగా నిలుస్తానని చెప్పారు.