ఏపీలో ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈకేవైసీ నమోదుకు నేటితో గడువు ముగియనుంది. రేపటి నుంచి ఆర్బీకేల్లో ఈ-క్రాప్ జాబితాను ప్రదర్శించనున్నారు. రైతుల పేర్లు, పంట సాగు వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని ఎడిట్ చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఇస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి తుది జాబితాను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు.