విశాఖ ఉత్తర నియోజక వర్గం 45వార్డు చిట్టి బాబు కోలని, సంతోషిమాత కోలని (రాజీవ్ గృహాలు) సెప్టిక్ పైపులు మరమ్మతులు నిమిత్తం 18 లక్షల 80 వేల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 45వార్డు కార్పొరేటర్ కంపా హనుక్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో 45వార్డు అధ్యక్షులు పైడి రమణ, డి. ఈ శ్రీనివాస్ వర్మ, ఏ. ఈ మోహన్, సన్నీ, దుర్గా, ఆది లక్ష్మీ, బాబురావు, నాయుడు, కార్యకర్తలు, కోలని మహిళలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.