ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. తాజాగా ఆయన కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల సంస్థ టెస్లా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా తయారుచేస్తోంది త్వరలోనే టెస్లా స్మార్ట్ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ కు సంబంధించి అధికారిక ప్రకటనేదీ రాకపోయినా, దీనికి సంబంధించిన అంశాలు విస్తృతంగా ప్రచారంలో ఉంది.
దీన్ని 'పై ఫోన్' గా పిలుస్తున్నారు. 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ తో వస్తోంది. ఈ స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్ మరియు గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
నూనె, జిడ్డు మరకల నుంచి రక్షణ కోసం స్క్రీన్ కు ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. 3 రియర్ కెమెరాలు, ఒక ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. రియర్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగినవి. ఫ్రంట్ కెమెరా కెపాసిటీ 40 ఎంపీ. 'పై ఫోన్' కోసం టెస్లా సొంతంగానే ప్రాసెసర్ ను అభివృద్ధి చేస్తోంది. ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచినట్టు తెలుస్తోంది.
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ ల కంటే ఓ మెట్టు పైనే ఉండేలా ఇందులో శాటిలైట్ ఫోన్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుందట. ధర రూ.80 వేల వరకు ఉండొచ్చని అంచనా. ఇందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారన్నది ఇంకా తెలియరాలేదు.