కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో మంగళవారం ప్రారంభమైంది. ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చేత్రగుడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ఏపీలో రాహుల్ 119 కిలోమీటర్లు నడవనున్నారు. అక్టోబర్ 22న మరలా కర్ణాటకలోని రాయచూర్లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. రాహుల్ పాదయాత్రతో నిస్తేజంగా ఉన్న ఏపీలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.