భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీసత్యసాయి జిల్లాలోని, హిందూపురం మండలం కొట్నూరు చెరువు ఉధృతికి ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగింది. హిందూపురం నుండి ధర్మవరంకు 34 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగిపోయింది. కాగా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. మరువ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పోలీసులు వాహనాలు వదులుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa