పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా...ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతున్నా..అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తుంది అని టీడీపీ నాయకులూ గొట్టిపాటి రవి కుమార్ వాపోయారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం దందా రోజురోజూ పేట్రేగిపోతుంటే ఉక్కుపాదం మోపాల్సిన పౌరసరఫరా, రెవెన్యూ, పోలీస్ శాఖలు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నాయి.గడచిన ఆరు నెలల కాలంలో మొత్తం 92 కేసులు నమోదవ్వడం అందులో 70 శాతం చీరాల,పర్చూరు,అద్దంకి పరిధిలోనే ఉండడం తీవ్రతను సూచిస్తోంది. ఇక అద్దంకి నియోజకవర్గంలో అయితే వీరి ఆగడాలకు అంతే లేకుండా పోయింది...రేషన్ బియ్యం అక్రమ దందాను ఉభయ జిల్లాల్లో వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే వ్యాపారులు శాసిస్తున్నారు. వీటన్నింటిపై విచారణ చేసి తెరవెనుక ఉన్న సూత్ర దారులపై కఠిన చర్యలు తీసుకొని పేదోడికి న్యాయం చేయాలి...లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అని అన్నారు.