ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతులపై దాడి అమానుషం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 18, 2022, 03:00 PM

నేడు రాజమండ్రిలో అమరావతి రైతులపై జరిగిన దాడిని కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారా డీజీపీ గారూ? అని టీడీపీ రాష్ట్ర నాయకులూ అచెం నాయుడు ప్రశ్నించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... రైతులకి, వైసీపీ కార్యకర్తలకి మధ్య జరిగిన వాగ్వాదంలో , రైతులకి , పాదయత్ర చేస్తున్న   వారికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు కూడా, సాక్షాత్తూ ఒక ఎంపీ ఆధ్వర్యంలో వీరిపై దాడి జరిగిందీ అంటే, ఇంక సామాన్యులకు ఏ విధమైన రక్షణ ఉంటుంది? తక్షణమే MP భరత్, అతడి గూండాలపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. మొన్న విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద నిరసన తెలిపిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారు. నేడు దాడి జరిగినా కేసులుండవా? టీడీపీ నేతలను, కార్యకర్తలను హౌజ్ అరెస్ట్లు చేసే మీరు వీళ్ళను అక్కడికి ఎలా రానిచ్చారు? అని ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com