చిలకలూరిపేట: వచ్చే కార్తీక మాసం నాటికి కొండవీడు కళకళలాడేలా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మంత్రి రజిని చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలోని తన కార్యాలయంలో కొండవీడు అభివృద్ధి పనులపై అటవీ శాఖ అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. మంత్రి రజిని మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కొండవీడు అభివృద్ధి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.