నగరంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించిన సీపీ శ్రీకాంత్. మంగళవారం నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోర్టు, గంగవరం పోర్టు, ఆర్. టి. ఓ, వ్యాపారులతో సమావేశమయ్యారు. గత నెల 22 నుంచి నగరంలో భారీ వాహనాల రాకపోకలపై సమయ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని భారీ వాహనాలతో రవాణాలపై ఆధారపడి వ్యాపారాలు చేసే వివిధ సంస్థలు వారి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. పై మార్పులతో ప్రమాదాలు అదుపులోనికి వచ్చిన నేపథ్యంలో వా‍్యాపారులకు నిర్ణీత సమయాలలో స్వల్ప మార్పులతో ఉదయం 07: 30 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి నుంచి 7గంటల వరకూ భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు, ఈ సమావేశంలో డి. సి. పి(క్రైమ్స్)జి. నాగన్న , ఏ. డి. సి. పి ( క్రైమ్స్ &ఇంచార్జి ట్రాఫిక్) డి. గంగాధర్, ఏ. సి. పి(ట్రాఫిక్) శరత్ కుమార్, సుధీర్ ములగాడ, వైస్ ప్రెసిడెంట్, ఏపీ ఛాంబర్స్, వివిధ షిప్పింగ్ కంపెనీ అధికారులు, అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.