వైఎస్ఆర్ విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షులు ప్రేమ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల్ని, కార్యకర్తలని చెప్పులతో కొడతానని అనడం హేతు బద్ధంగా ఉందన్నారు. కొడకల్లారా అని బూతులు తిడుతూ రాష్ట్రంలో విష సంస్కృతిని సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా పనికిరాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ. ఆయన మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డికి, వైయస్సార్సీపి కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యాసారపు వెంకటేష్, విద్యార్థి నాయకులు ముని, నరేష్, మళ్లీ, పవన్, కలందర్, శివనాయక్, శీను, తదితరులు పాల్గొన్నారు.