చిత్తూరు, నగరి: విజయపురం మండలం బూచివానెత్తం గ్రామానికి చెందిన సునీతకు వైయస్సార్ బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంత్రి రోజా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీత కుటుంబ సభ్యులు మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయపురం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.