వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని బుధవారం పరిశీలించారు. ఎడ్లపాడు మండలం దింతేనపాడు గ్రామం మరియు నాదెండ్ల గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ శివ శంకర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పంట దెబ్బతిన్న ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టం వివరాలను సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.