భూముల రీసర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుందని, రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుందని, ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.