రాజకీయ పార్టీ పెట్టి.. ఒక్కచోట కూడా పోటీచేయకుండా మరొక పార్టీకి ఓటేయమని చెప్పేవాడిని ప్యాకేజీ స్టార్ అనకుండా మరేమంటారు..? పవన్ కల్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ కల్యాణే అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. నోవాటెల్ వేదికగా ముసుగు దొంగల నిజస్వరూపం బయటపడిందన్నారు. రాజకీయ జీవితం మొత్తం ప్యాకేజీకి అమ్ముడుపోయేవాడే పవన్ కల్యాణ్ అని మంత్రి జోగి రమేష్ పునరుద్ఘాటించారు. పవన్ యజమాని చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో ఏం చేశాడో.. మా మూడున్నరేళ్ల పరిపాలనలో ఏం చేశామో చర్చించేందుకు సింగిల్‌గా వస్తానని, టైమ్, డేట్, ప్లేస్ ఫిక్స్ చేసి మీడియా సమక్షంలో చర్చకు వచ్చే దమ్ము పవన్‌కు ఉందా..? ఉంటే చర్చకు రావాలని పవన్‌కు మంత్రి జోగి రమేష్ బహిరంగ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.