విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) బల్క్‌లో భూముల వేలాన్ని మళ్లీ వాయిదా వేసింది. ఈ నెల 16న వేలం నిర్వహించాల్సి ఉంది. మధురవాడ, కాపులుప్పాడ, తుమ్మపాల తదితర ప్రాంతాల్లో ఎకరాల చొప్పున భూములను ఈ-వేలం ద్వారా విక్రయానికి ప్రకటన ఇచ్చింది. అయితే కొనుగోలుదారుల నుంచి తగినంత స్పందన రాకపోవడంతో వాయిదా వేసింది. ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ మరో పది రోజులు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28వ తేదీన వేలం నిర్వహిస్తామని మరో ప్రకటన జారీచేసింది.