ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని అమెరికన్ కాన్సులేట్ అధికారుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య పి. వి. జె. డి ప్రసాదరెడ్డితో వారు భేటీ అయ్యారు. ఏయూలో ఉన్నత విద్య సర్టిఫికేట్ల జారీ విధానం, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై చర్చించారు. ఏయూ సర్టిఫికేట్ల జారీలో అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు, ప్రత్యేకతలను వీసీ ప్రసాదరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా అమెరికన్ కాన్సులేట్ స్పెషల్ ఏజెంట్, ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారిణి ఎరిన్ ఇ ఫిషర్ మాట్లాడుతూ వీసాల మంజూరులో సర్టిఫికేట్లు ఎంతో కీలకంగా నిలుస్తున్నాయన్నారు. నకిలీలు తయారీకి సాధ్యం కానివిధంగా సర్టిఫికెట్ల జారీకి ఏయూ. చేపడుతున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, అభినం దించారు.
ఏయూ నుంచి విలులైన సూచనలు తాము ఆహ్వానిస్తున్నామన్నారు. ఏయూ వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకమైన యాప్ను కాన్సులేట్ తయారు చేయాలని సూచించారు. కాన్సులేట్కు దరఖాస్తు చేసే సంబంధిత విద్యార్థి సర్టిఫికేట్లను యాప్ అప్లోడ్ చేయడం జరుగుతుంద న్నారు. తద్వారా తనిఖీ, పరిశీలన వంటివి. సులభమవుతాయన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణమోహన్, పాలక మండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ప్రిన్సిపాల్స్ వి. విజయలక్ష్మి, పేరి శ్రీనివాస రావు, ఎస్. కె భట్టి, డీన్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, ఆచార్య గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.