చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి తిరువన్నమలైకి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. చిత్తూరు వేలూరు మీదుగా పోవుటకు రూ. 540, చౌడేపల్లి సదుం మీదుగా వచ్చుటకు 597 రూపాయలు చార్జిగా నిర్ణయించామన్నారు.