తిరుపతిలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ బ్యానర్లను పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ అనుపమ అంజలి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యానర్లపై నిషేధంలో భాగంగా తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సూచించారు.