కాకినాడ రంగరాయ మెడికల్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు ర్యాగింగ్ వ్యతిరేక చట్టం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, దిశ చట్టం గురించి అవగాహన సదస్సు ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు హాజరైనారు. 19.10.2022 వ తేదీన సాయంత్రం 5 గం.లకు కాకినాడ, రంగరాయ మెడికల్ కాలేజ్, ఆడిటోరియం నందు ర్యాగింగ్ వ్యతిరేక చట్టం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, దిశ చట్టం గురించి జిల్లా SP శ్రీ ఎం.రవీంద్రనాథ్ బాబు, IPS .అధ్యక్షతన వైద్య విద్యార్దులకు అవగాహన సదస్సు ప్రారంభించినారు. ఈ అవగాహన సదస్సుకు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. డి.ఎస్.వి.యల్, నరసింహం, ఎం.ఎస్. (జి.ఎస్.), SB DSP శ్రీ ఎం.అంభికా ప్రసాద్, కాకినాడ డి.ఎస్.పి. శ్రీ వి. భీమారావు, కాకినాడ క్రైమ్ డి.ఎస్.పి. శ్రీ ఎస్. రాంబాబు తదితరులు హాజరయ్యారు.