ఎన్టీఆర్ మానస పుత్రిక ద్రవిడ విశ్వవిద్యాలయం రజతోత్సవాలను జరుపుకుంటున్న వేళ విద్యార్థులకు, సిబ్బందికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... అతి ప్రాచీనమైన, సుసంపన్నమైన ద్రావిడ భాషా సంస్కృతుల అభివృద్ధికి ప్రత్యేకంగా ద్రవిడ విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్నది ఎన్టీఆర్ సంకల్పం. నేను మొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక ఉమ్మడి ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు దగ్గరగా ఉండేలా... కుప్పంలో 1093 ఎకరాల విస్తీర్ణంలో 1997 అక్టోబర్ 20న ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దక్షిణ భారత భాషలకు జీవంపోస్తూ, వేల సంవత్సరాల సంస్కృతిని, కళలను కాపాడుతూ వస్తున్న ద్రావిడ విశ్వవిద్యాలయం, ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వర్సిటీ ప్రతిష్ట మసకబారేలా అనేక ఘటనలు జరగడం దురదృష్టకరం. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని వర్సిటీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలి.