ఎయిర్ కూలర్ ఆన్ చేశాడని ఓ మహిళ ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన చత్తీస్గఢ్లోని అంబికాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగింది. ఓ వ్యక్తి ఆస్పత్రిలోని వెయిటింగ్ హాల్లో పడుకున్నాడు. ఆ హాల్లోనే చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే ఆ మహిళ లేచి ఎయిర్ కూలర్ ఆఫ్ చేసింది. దానికి ఆ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మళ్లీ ఆన్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టి కాలుతో తన్నింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెక్యూరిటీ గార్డులు వచ్చి ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ వ్యక్తి సరైన కారణం లేకుండా అక్కడ ఉన్నాడని, కేవలం పడుకోవడానికే అక్కడికి వచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తర్వాత నిర్ధారించింది.