బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏ. వి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అసంబ్లీ ఇంచార్జి పోతు గుంట రమేష్ నాయుడు లు అన్నారు. బుధవారం రాజంపేటలోని వజ్రం ఫంక్షన్ హాల్ పశ్చిమ నియోజకవర్గం పట్టణ ఎన్నికల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఎవరితో అయితే అభివృద్ధి చెందుతుందో, ఎవరైతే తమ సమస్యలను పరిష్కరిస్తారో అలాంటి వారిని ఓటు వేసి గెలిపించాలని వారన్నారు. తొలుత ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.