ముద్దనూరు మండలంలోని కొత్తచౌటిపల్లెలోని బుధవారం సాయంత్రం రెండు వేర్వేరు దేవాలయాల హుండీల్లో చోరీ చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల. ప్రకారం. గ్రామంలోని లింగమయ్య స్వామి, అంకాలమ్మ దేవాలయాల్లో చోరీ జరిగినట్లు చెప్పారు. అంకాలమ్మ గుడిలోని హుండీని తల క్రిందులు చేసి రూ. 6వేలు నగదు దోచుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఆలయంలో ఏడాదికి ఇప్పటి వరకు దాదాపురూ. 40వేలు వరకు కానుకలు వస్తాయన్నారు. ప్రస్తుతం హుండీలో రూ. 5 వేలు నగదు ఉందన్నారు. అంకాలమ్మ గుడి పూజారి వెళ్లి చూసే సరికి హుండీ పగులగొట్టి ఉందన్నారు. చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు.