ఐఆర్సీటీసీ రైల్వే ప్రయాణికుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు ఇకపై టికెట్ బుక్ చేసుకున్నాక టికెట్ మొత్తాన్ని ఈఎంఐ పద్దతిలో చెల్లించవచ్చు. ట్రావెల్ నౌ-పే లేటర్ సేవలను తాజాగా ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టికెట్ కి డబ్బుల్ని 6 లేదా 8 వాయిదాల్లో చెల్లించొచ్చు. కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుంది.