పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో అకాల వర్షాల కారణంగా ఇటీవల దెబ్బతిన్న పత్తి,మిర్చి పంట పొలాలను టీడీపీ నాయకులూ యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించి, నష్టపోయిన రైతులు సొంటెం నాగేశ్వరావు, కొప్పూరి హైమావతి మరియు ఇతర రైతులను పరామర్శించడం జరిగింది. పంట తీవ్రంగా నష్టపోయిన రైతులను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆదుకోవాలి లేని పక్షంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేనా, లేదా లీగల్ గా ఫైట్ చేసైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అయన డిమాండ్ చేసారు.