తమకు ఏ అన్యాయం జరిగినా, ఏ ఆపద కలిగినా ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది పోలీసు. అటువంటి పోలీసులు తమ బాధ్యతా నిర్వహణలో ప్రాణాలను కాపాడటమే కాదు.... ఒక్కోసారి తమ ప్రాణాలను సైతం కోల్పోతారు. అందుకే పోలీసులపై ఒత్తిడి లేకుండా చూడటం, వారి సంక్షేమం కోసం కృషి చేయడం ప్రభుత్వాల బాధ్యత. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులకు... పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.