మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు నిజాంపట్నం ఎస్ఐ రమేష్ తెలిపారు. కూచినపూడి ప్రభుత్వం మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా పని చేస్తున్న మొగలి గోపయ్య కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన వ్యక్తికి 44 మద్యం సీసాలను అక్రమంగా అమ్ముతుండగా మధ్యవర్తుల సమక్షంలో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.