శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో 53 మంది బాణ సంచా తాత్కాలిక విక్రయాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రెండురోజుల పాటు అమ్మకాలకు అవకాశం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించిన అనం తరం అనుమతి ఇవ్వడానికి ఆర్టీవో బి. శాంతి నిర్ణయించారు.
ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించే దరఖాస్తుదారులకు మాత్రమే తాత్కాలిక విక్రయాలకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబు తున్నారు. 53 దరఖాస్తుల్లో శ్రీకాకుళం నగరంలో 18 మంది , శ్రీకా కుళం రూరల్ పరిధిలో రాగోలు , సింగుపురంలో చెరో ఒకటి చొప్పున ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. ఎచ్చెర్ల 12 , గార 2 , రణస్థలం 3 , లావేరు 1 , ఆమదాలవలస మున్సిపాలిటీ 2 , బూర్జ 1 , సరుబుజ్జిలి 1 , నరసన్నపేట 6 , పోలాకి 1 , జలుమూరులో ఒకటి ఏర్పాటుచేయడానికి దరఖాస్తులు వచ్చాయి. పొందూరు , సిగడాం మండలాల నుంచి ఒక్క దరఖాస్తు రాకపోవడం గమర్హం.