ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అని నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... మోసపు హామీలతో పోలీసులకూ టోపీ పెట్టారు జగన్ మోసపు రెడ్డి. సమస్యలు పరిష్కరించమని అడిగినందుకు దళిత కానిస్టేబుల్ ప్రకాష్ పై వేటు వెయ్యడం నియంత పాలనకు పరాకాష్ట. ఏటా భర్తీ చేస్తామన్న 6 వేల పోస్టులు గాల్లోనే ఉన్నాయి. కోవిడ్ లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన పోలీసు కుటుంబాలకు ఇస్తామన్న రూ.10 లక్షల ఆర్థిక సాయం ఒక్కరికైనా ఇచ్చారా? ఫిట్మెంట్, సరెండర్ లీవ్స్, టిఎ, డిఎ, వీక్లీ ఆఫ్, జిపిఎఫ్ డబ్బులు, పోలీసు సంక్షేమ నిధులు.. ఏదీ సమయానికి రాక పోలీసులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పోలీసు వ్యవస్థ కి దక్కిన గౌరవాన్ని మంటగలిపే విధంగా ఐపిసి పక్కన పెట్టి జేపిసి అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు ఈ రోజు నుంచైనా మారతారని ఆశిస్తున్నాను అని ఎద్దేవా చేసారు.