- తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన యాపిల్ రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.
- మధుమేహం దరిచేరకుండా నియంత్రిస్తుంది. యాపిల్, పియర్స్ పండ్లు తీసుకుంటే మధుమేహం ముప్పు 18 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
- యాపిల్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు, పాలీపెనాల్స్ శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- యాపిల్స్ తరచూ తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- యాపిల్స్ లో ఉండే పీచు పదార్ధాలతో త్వరగా ఆకలి వేయకుండా ఉండటం అధిక బరువు నియంత్రణకు ఉపకరిస్తుంది.
- యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.