ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనం చోరీకి గురైన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభిరామా శుక్రవారం తెలిపారు. ఏటీఎం సెంటర్ సమీపంలో రహీం భాష ఈనెల 18వ తేదీ ద్విచక్ర వాహనాన్ని తన ఇంటి ముందు పార్కింగ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఇంటి బయటకొచ్చి చూస్తే బండి కనిపించలేదు. దీంతో ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.