పవన్ కళ్యాణ్‌పై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు శనివారం నోటీసులు పంపింది. తన మూడు పెళ్లిళ్లపై వైసీపీ విమర్శలను ఖండిస్తూ, ఇష్టం ఉంటే మీరూ చేసుకోండని పవన్ ఇటీవల అన్నారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, మహిళలకు క్షమాపణలు చెప్పాలని కమిషన్ ఆదేశించింది. భరణం అందించి, ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చనే పవన్ వ్యాఖ్యలు బాధాకరమని కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.